నాని 'శ్యాయ్ సింగ‌రాయ్' అప్‌డేట్ వ‌చ్చేసింది

Nani upcoming movie Shyam Singha Roy update.టాలీవుడ్ యంగ్ నాని జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2021 4:15 PM IST
Nani upcoming movie Shyam Singha Roy update

టాలీవుడ్ యంగ్ హీరో నాని జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది 'వి' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే.. ఈ సినిమా అభిమానుల‌ను నిరాశ ప‌రిచింది. త్వరలో 'టక్ జగదీష్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‌'నిన్నుకోరి' లాంటి మంచి హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రంతో పాటు 'శ్యామ్ సింగరాయ్' అనే సినిమా చేస్తున్నాడు నాని.

'టాక్సీవాలా' సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి న‌టిస్తున్నారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నరు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కొద్ది సేప‌టి క్రితం చిత్రం బృందం ఓ వీడియో ద్వారా వెల్ల‌డించింది.



Next Story