ఆక‌ట్టుకుంటున్న 'శ్యామ్ సింగ‌రాయ్' టీజ‌ర్‌.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే

Nani Shyam Singha Roy Movie Teaser out.నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ‌రాయ్‌. రాహుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2021 10:38 AM IST
ఆక‌ట్టుకుంటున్న శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్‌.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే

నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగ‌రాయ్‌'. రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్రమోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా నేడు ఈ చిత్ర టీజ‌ర్‌ను నాలుగు బాష‌ల్లో విడుద‌ల చేశారు. తెలుగులో నాని, తమిళంలో శివకార్తికేయన్, మలయాళంలో నజ్రియా, కన్నడలో రక్షిత్ శెట్టి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల అయ్యింది. అడిగే అండలేదు.. కలబడే కండలేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే కాగితే కడుపు చీల్చుకు పుట్టి, రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే 'శ్యామ్ సింగ రాయ్' అంటూ హీరోను ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. 'స్త్రీ ఎవ్వ‌రికీ దాసి కాదు.. ఆఖ‌రికి దేవుడికి కూడా ఖ‌బ‌డ్దార్ 'అంటూ నాని చెప్పే డైలాగ్‌లు ప్ర‌తి ఒక్క‌రిలో స్పూర్తి నింపేలా ఉన్నాయి.

Next Story