ఊర‌మాస్ లుక్‌లో నేచుర‌ల్ స్టార్‌.. వీడియో వైర‌ల్‌

Nani looks intense in first look poster in Dasara Movie.‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపుమీదున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2022 1:06 PM IST
ఊర‌మాస్ లుక్‌లో నేచుర‌ల్ స్టార్‌.. వీడియో వైర‌ల్‌

'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపుమీదున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఈ క్ర‌మంలో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే 'అంటే.. సుందరానికీ!' సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన నాని ప్ర‌స్తుతం 'దసరా' సినిమా షూటింగ్‌ను మొద‌లెట్టేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కీర్తిసురేశ్ న‌టిస్తోంది. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి నాని ఫ‌స్ట్ లుక్ ఫోస్ట‌ర్ నువిడుద‌ల చేసింది.

ఈ ఫస్టు లుక్ వీడియోలో నాని చూసిన అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మండుతున్న ఓపెన్ క్వారీలో టిప్పర్ లలో బొగ్గు లోడ్ చేస్తున్న విజువల్స్ తో వీడియో మొదలైంది. బ్లాక్ కలర్ గల్ల లుంగీ, ఎర్ర‌చొక్కా ధరించి చేతిలో బీడీ పట్టుకుని మండుతున్న బొగ్గుతో బీడీని అంటించుకుని.. ముందు రెండు 90 ఎం.ఎల్ బాటిల్స్ తో ఊర మాస్ లుక్‌లో స‌రికొత్త మేకోవ‌ర్‌లో క‌నిపిస్తున్నాడు నాని. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ లవ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ బాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి సంతోష‌న్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Next Story