కాసేపు బయటివాడిని చేశారనే బాధ కలిగించింది: హీరో నాని

Nani Comments on Tuck Jagadish Trailer Release Event.టక్ జగదీష్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాని కీలక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 4:08 AM GMT
కాసేపు బయటివాడిని చేశారనే బాధ కలిగించింది: హీరో నాని

హైదరాబాద్: టక్ జగదీష్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు అనుకూలించిన సమయంలో థియేటర్‌లో నా సినిమా రిలీజ్ కాకపోతే నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా అంటూ నాని తెలిపారు. ఇటీవల పలువురు వ్యక్తులు చేసిన ఆరోపణలపై నాని మాట్లాడుతూ.. ఎవరో నా సినిమాలు బ్యాన్ చేస్తానని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల మేరకు వారు అలా మాట్లాడి ఉంటారని, వారిపై నాకు గౌరవం ఉందని నాని అన్నారు. వారు నాపై పలు ఆరోపణలు చేశారు. ఆ సమయంలో కాసేపు నన్ను బయటివాడిలా చూడటం బాధ కలిగించిందని హీరో నాని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు బాగోలేకే 'టక్ జగదీష్' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తోందన్నారు.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. పరిస్థితులు బాగోలేకపోవడం వల్లనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ఒక్కో నిర్మాణ సంస్థకు ఒక్కోరకమైన సమస్యలు ఉంటాయని, అందరినీ ఒకేలా చూడలేమని అన్నారు. హెచ్‌ఐసీసీలో 'టక్ జగదీష్' సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 'టక్ జగదీష్' సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు.

Next Story
Share it