శ్యామ్ సింగరాయ్ 63 అడుగుల భారీ కటౌట్
Nani 63 Feet Cutout of Shyam Singha Roy at RTC X Roads.నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్.
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 11:49 AM ISTనేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క హిందీ బాషలో తప్ప మిగిలిన దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలలో విడుదల చేస్తున్నారు. నాని నటించిన గత రెండు చిత్రాలు వీ, టక్ జగదీష్ ఓటీటీ వేదికగా విడుదల అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత నాని నటించిన చిత్రం థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నాని అభిమానులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని 70 ఎంఎం థియేటర్‌లో 63 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యుఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈచిత్రంపై హీరో నాని చాలా ధీమాగా ఉన్నారు. ఈసారి క్రిస్మస్ మనదే అని నమ్మకంగా చెబుతున్నారు. 'వి' 'టక్ జగదీష్' సినిమాలను ఓటీటీలో విడుదల చేసిన నాని కి.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ అవుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.