శవం ద‌గ్గ‌ర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన న‌టి.. వీడియో వైర‌ల్‌

Nandini Rai Dance Next To Posani's Corpse.సినిమాల్లో న‌టించిన రాని గుర్తింపు బిగ్‌బాస్ షో ద‌క్కించుకున్న చిన్న‌ది నందిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2021 12:31 PM IST
శవం ద‌గ్గ‌ర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన న‌టి.. వీడియో వైర‌ల్‌

సినిమాల్లో న‌టించిన రాని గుర్తింపు బిగ్‌బాస్ షో ద‌క్కించుకున్న చిన్న‌ది నందిని రాయ్‌. బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో అమ్మ‌డు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గిట్టింది. తాజాగా నందిని రాయ్ డ్యాన్స్ చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం నందిని 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్' అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఈ సిరీస్‌ షూటింగ్‌ మధ్యలో చేసిన అల్లరి పనులకు సాంపుల్‌గా ఓ వీడియోను షేర్‌ చేసింది.

ఈ వెబ్‌సిరీస్‌లో పోసాని కృష్ణ ముర‌ళీ కూడా న‌టిస్తున్నారు. ఇందులో పోసాని చ‌నిపోయే స‌న్నివేశం ఉంది. శవంపై పూజలు జల్లి.. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ చూడడానికి వీలుగా పడుకోబెట్టారు. ఫోటో దగ్గర అగరబత్తిని కూడా వెలిగించారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఏడవాల్సిన సమయంలో నందిని రాయ్ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు ఓ రేంజ్ లో స్టెప్పులు వేసింది. షూటింగ్ గ్యాప్‌లో అమ్మ‌డు చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story