నందమూరి తార‌క‌ర‌త్న హెల్త్ అప్‌డేట్‌.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే..?

Nandamuri Taraka Ratna health update Today.సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 5:44 PM IST
నందమూరి తార‌క‌ర‌త్న హెల్త్ అప్‌డేట్‌.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే..?

సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 27న కుప్పంలో నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో పాల్గొన్న స‌మ‌యంలో తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురి కాగా.. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం ఆయ‌న్ను బెంగ‌ళూరుకు త‌ర‌లించారు.

విదేశీ వైద్యుల‌ను ర‌ప్పించి అక్క‌డ ఆయ‌న‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించిన ఓ అప్‌డేట్ వ‌చ్చింది. తార‌క‌రత్న‌కు గురువారం ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. మెద‌డుకు సంబంధించిన వైద్య చికిత్స కొన‌సాగుతుంద‌న్నారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Next Story