సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన నందమూరి ఫ్యామిలీ
Nandamuri family paid tribute to NTR. నేడు దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగు దేశం
By అంజి Published on 18 Jan 2023 5:59 AM GMTనేడు దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 27వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, రామకృష్ణ, సుహాసినితో పాటు నందమూరి ఫ్యామిలీ శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మరిచిపోరని అన్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం కేవలం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మాట తప్పని ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని, తెలుగుదేశం రూపంలో తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని బాలకృష్ణ చెప్పారు.
♦తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 18, 2023
♦ఈ తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. pic.twitter.com/LWxo3khDzV
♦ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు. pic.twitter.com/FzPUKZhHW3
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 18, 2023