త్వరలో రాబోతున్న బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్-2

అన్ స్టాపబుల్.. ఆహాలో వచ్చిన ఈ షో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నటసింహం నందమూరి బాలకృష్ణని

By Medi Samrat  Published on  17 Sept 2022 4:07 PM IST
త్వరలో రాబోతున్న బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్-2

అన్ స్టాపబుల్.. ఆహాలో వచ్చిన ఈ షో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నటసింహం నందమూరి బాలకృష్ణని ఎన్నడూ చూడని యాంగిల్ లో ప్రెజెంట్ చేశారు. ఎంతో మంది ఈ షో ద్వారా బాలయ్యకు ఫ్యాన్స్ అయ్యారు.. కాదు.. కాదు.. ఫిదా అయ్యారు. ఇక రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆహా నుండి ఒక మంచి అప్డేట్ వచ్చింది.

అన్‌స్టాప‌బు‌ల్ రెండో సీజ‌న్ అతి త్వ‌ర‌లో ముందుకు వ‌స్తోందంటూ ట్విట్ట‌ర్ లో ఆహా వెల్ల‌డించింది. కొత్త సీజ‌న్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా పేర్కొనలేదు. పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది. అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ద‌సరా లేదా దీపావ‌ళికి కొత్త సీజ‌న్ ప్రారంభం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా అంటూ బాల‌య్య మార్కు డైలాగ్ హ్యాష్‌ట్యాగ్ ను జ‌త చేసింది. సీజన్-1 లో కొందరినే ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. ఇప్పుడు రెండో సీజన్ లో ఏ హీరోలు, హీరోయిన్లు వస్తారా అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవిని నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరిక రెండో సీజన్ లో తీరే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య సందడి అతి త్వరలో మొదలుకాబోతోందని మాత్రం అందరికీ అర్థం అయిపోయింది. ఇక మనం వెయింటింగ్ చేయక తప్పదు.


Next Story