ముస్లిం సోద‌రుల‌కు బాల‌కృష్ణ రంజాన్ శుభాకాంక్ష‌లు.. 'మీ అకుంఠిత దీక్ష‌కు నా స‌లాం'

Nandamuri Balakrishna Eid Mubarak Wishes to Muslims.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల‌కు సినీ న‌టుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 11:58 AM IST
ముస్లిం సోద‌రుల‌కు బాల‌కృష్ణ రంజాన్ శుభాకాంక్ష‌లు.. మీ అకుంఠిత దీక్ష‌కు నా స‌లాం

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల‌కు సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు బాల‌య్య ఓ వీడియో బైట్ ను షేర్ చేశారు.

"ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. మ‌త గురువు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం. ఒక వైపు ఆధ్యాత్మికత, మరో వైపు సర్వమాన సమానత్వం సేవాభావం చాటి చెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరు సుఖసంతోషాలతో ఉండాలని.. మనకు మంచి భవిషత్తును ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని బాల‌య్య చెప్పారు. బాలకృష్ణతోపాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.




Next Story