వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి 'డాకూ మహారాజ్' గా వెండితెరపై సందడి చేయనున్నారు. డాకు మహారాజ్ ట్రైలర్ ఆకట్టుకుంటూ ఉంది. రిచ్ విజువల్స్ తో నిండిపోయింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
ట్రైలర్‌లో బాలకృష్ణ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు. ఒకటి సీతారాం – ప్రభుత్వ అధికారి, రెండవది డాకు మహారాజ్, మూడవది నానాజీ. డాకు మహారాజ్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలవనుంది. జైలర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి పనిచేశారు. డాకు మహారాజ్ ట్రైలర్ రిచ్ విజువల్స్‌తో నిండిపోయింది. ఈ ట్రైలర్ బాలకృష్ణ ఇతర చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంది. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని సమ పాళ్లలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. బాలకృష్ణని బాబీ చాలా కొత్తగా చూపించాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.