మెగాఫ్యాన్స్‌కు పూన‌కాలే.. 'గాడ్‌ ఫాదర్‌' నుంచి పవర్ ఫుల్ సాంగ్ విడుదల

Najabhaja lyrical song from Godfather Movie out.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాద‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sept 2022 8:57 AM IST
మెగాఫ్యాన్స్‌కు పూన‌కాలే.. గాడ్‌ ఫాదర్‌ నుంచి పవర్ ఫుల్ సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'గాడ్‌ఫాద‌ర్‌'. మ‌ల‌యాళ మూవీ 'లూసిఫ‌ర్‌'కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్‌, స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా 'నజభజ జ‌జ‌ర' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా శ్రీకృష్ణ‌, పృథ్విచంద్ర పాడారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందించిన ఈ పాట అభిమానుల‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతుంది. ఇంకెందు ఆల‌స్యం మీరు ఓసారి ఈ పాట‌ను వినేయండి.

Next Story