ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. 'న‌గుమోము తార‌లే' వీడియో సాంగ్ విడుద‌ల‌

Nagumomu Thaarale Video Song release from Radhe Shyam.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2021 11:47 AM IST
ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. న‌గుమోము తార‌లే వీడియో సాంగ్ విడుద‌ల‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్డే న‌టిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌వ‌న‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ చిత్రంలోని రెండో పాట మొద‌ట హిందీ వెర్ష‌న్‌ని నిన్న విడుద‌ల చేయ‌గా.. నేడు తెలుగుతో పాటు మిగ‌తా భాష‌ల్లో విడుద‌ల చేశారు. 'నగుమోము తారాలే' అంటూ సాగే ఈ పాట హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య రొమాన్స్, డైలాగ్స్ తో పాటు సిద్ శ్రీరామ్ వాయిస్ మ్యాజిక్ మైమరిపిస్తోంది.

ఈ పాట‌కు కృష్ణ‌కాంత్ లిరిక్స్ అందించ‌గా జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతాన్ని అందించారు. తెలుగు, తమి భాషల్లో సిద్ శ్రీరామ్ పాడగా.. కన్నడ, మలయాళ వెర్షన్‌లలో సౌరాజ్ సంతోష్ పాడారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్.. విక్ర‌మాదిత్యగా క‌నిపించ‌బోతున్నాడు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా కాలం త‌రువాత ప్ర‌భాస్ రొమాంటిక్ జానర్ లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story