ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన అశ్విన్‌.. డేట్స్‌తో స‌హా చెప్పేశాడు

NagAshwin gave super kick to Prabhas fans.'బాహుబ‌లి' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్ర‌భాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jan 2021 12:31 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన అశ్విన్‌.. డేట్స్‌తో స‌హా చెప్పేశాడు

బాహుబ‌లి చిత్రంతో జాతీయ స్థాయిలో ప్ర‌భాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న త‌న చిత్రాల‌ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఉండేట‌ట్లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఒక‌టి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్‌లోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మరి మంచి స్కై ఫై థ్రిల్లర్ సబ్జెక్టు తో సిద్ధం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను ఇస్తాన‌ని డేట్స్‌తో స‌హా ప్ర‌ట‌క‌టించాడు నాగ్ అశ్విన్‌.


వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ్అశ్విన్‌-ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో ఓ భారీ ప్రాజెక్టు రానున్న‌ట్లు గ‌తేడాది చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపికా ప‌దుకొణె న‌టించ‌నుండ‌గా.. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సంక్రాంతి త‌రువాత ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తాన‌ని ఇది వ‌ర‌కే అశ్విన్ చెప్పాడు. అన్న‌ట్లుగానే.. మొదటి అప్డేట్ ఈ జనవరి 29న వదలనుండగా రెండో అప్డేట్ ను వచ్చే ఫిబ్రవరి 26 న ఇస్తున్నట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్విట్టర్ లో చల్లటి కబురును అందజేశాడు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యిపోయారు.




Next Story