నాగార్జున కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. పోస్టర్ అదిరిపోయిందిగా
Nagarjuna new movie title name is The Ghost.కింగ్ అక్కినేని నాగార్జున ఓ పక్క రియాలిటీ షోకు వ్యాఖ్యతగా
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2021 10:45 AM ISTకింగ్ అక్కినేని నాగార్జున ఓ పక్క రియాలిటీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ.. మరోవైపు వరుసగా చిత్రాలను చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'ది ఘోస్ట్ 'అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Wishing King @iamnagarujuna garu a fabulous birthday 🥳 🎂 🎉#TheGhost #KingNagarjuna #KingNagarjunasGhost @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial @anikhaofficial_#HBDKingNagarjuna pic.twitter.com/KTLQUZovU3
— Praveen Sattaru (@PraveenSattaru) August 29, 2021
ఈ పోస్టర్‌లో నాగార్జున వర్షంలో కత్తి పట్టుకుని నిలబడగా.. ఎదురుగా కొంత మంది ఆంగ్లేయులు మోకాళ్లపై కూర్చొని వేడుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా.. ఈచిత్రంలో నాగ్ సరసన కాజల్ నటిస్తోంది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, యువ మలయాళ బ్యూటీ అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.