ఇంట్రెస్టింగ్ గా నాగార్జున కొత్త మూవీ ప్రీ లుక్‌

Nagarjuna New movie pre look out.కింగ్ అక్కినేని నాగార్జున ఓ ప‌క్క రియాలిటీ షోకు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2021 11:08 AM IST
ఇంట్రెస్టింగ్ గా నాగార్జున కొత్త మూవీ ప్రీ లుక్‌

కింగ్ అక్కినేని నాగార్జున ఓ ప‌క్క రియాలిటీ షోకు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. మ‌రోవైపు వ‌రుస‌గా చిత్రాల‌ను చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా ఈ చిత్ర నుంచి ప్రీలుక్‌ను రిలీజ్ చేశారు. మోనోక్రోమ్ ప్రీ-లుక్ పోస్టర్ లో హీరో కనిపిస్తున్నాడు. నాగార్జున రక్తంలో తడిసిన కత్తిని పట్టుకుని వర్షంలో నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ డిజైన్ అభిమానుల‌ను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో నాగ్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, యువ మలయాళ బ్యూటీ అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగార్జున‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29 న ఫస్ట్ లుక్ విడుదల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Next Story