నాగార్జున ‘నా సామిరంగ’ టీజర్ విడుద‌ల‌.. మూడో హీరో కూడా ఉన్నాడే..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’ టీజర్ ఆదివారం విడుదలైంది.

By Medi Samrat  Published on  17 Dec 2023 8:41 PM IST
నాగార్జున ‘నా సామిరంగ’ టీజర్ విడుద‌ల‌.. మూడో హీరో కూడా ఉన్నాడే..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’ టీజర్ ఆదివారం విడుదలైంది. 1 నిమిషం 46 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ యాక్షన్, ఎమోషన్ క‌ల‌బోసి వినోదాత్మకంగా ఉంది. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ‘నా సామి రంగ’లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


నాగార్జున గురించి ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. 'ఆడేమైన కుర్రాడు అనుకుంటున్నాడా.. తగ్గమను' అని ఆషిక చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది. కింగ్ నాగార్జున మామిడి తోట ఫైట్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్, ఆషికా పదేళ్లుగా మాట్లాడుకోరు. కానీ కళ్లతో కమ్యునికేట్ చేసుకుంటారు. యంగ్ ఏజ్ లో వీరిద్దరి ప్రేమ, నాగ్ తన స్నేహితులైన అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో స్నేహం చాలా అద్భుతంగా టీజర్ లో ప్రజెంట్ చేశారు. టీజ‌ర్ చూస్తే నాగర్జున‌, నరేష్, రాజ్ తరుణ్‌ల న‌ట‌న‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story