మన్మథుడికి నోటీసులు.. ఎందుకంటే..?

Nagarjuna gets stop work notice over illegal construction work in Goa.కింగ్ అక్కినేని నాగార్జున‌కు ఊహించ‌ని షాక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2022 8:13 AM IST
మన్మథుడికి నోటీసులు.. ఎందుకంటే..?

కింగ్ అక్కినేని నాగార్జున‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టారని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేశారు.

ఉత్తర గోవాలోని మాండ్రేమ్ గ్రామంలోని అశ్వేవాడ‌లో నాగార్జున ఓ నిర్మాణాన్ని చేప‌ట్టారు. అయితే.. ఈ నిర్మాణానికి నాగ్ ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌ని ఆరోపిస్తూ మాండ్రేమ్ పంచాయ‌తీ సర్పంచ్ నోటీసులు జారీ చేశారు. "మాండ్రేమ్​ పంచాయతీ సర్వే నెం.211/2బి అశ్వేవాడ, మాండ్రేమ్ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్​ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. నాగ్ ఈ విష‌యంపై ఇంకా స్పందించ‌లేదు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల బిగ్‌బాస్ సీజ‌న్ 6ను విజ‌య‌వంతంగా ముగిసింది. నాగ్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. వ‌చ్చే సీజ‌న్ నుంచి కింగ్ బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా ఉండ‌ర‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. సోనాల్ చౌహాన్‌తో క‌లిసి 'ది ఘోస్ట్' చిత్రంలో న‌టించారు నాగ్‌. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది.

Next Story