కోడలి పిల్ల వచ్చినందుకు నాగార్జున ఫుల్ ఖుషీ

శోభితా ధూళిపాళను తన కుటుంబంలోకి స్వాగతించారు సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని.

By Medi Samrat  Published on  8 Aug 2024 9:45 PM IST
కోడలి పిల్ల వచ్చినందుకు నాగార్జున ఫుల్ ఖుషీ

శోభితా ధూళిపాళను తన కుటుంబంలోకి స్వాగతించారు సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ ఆత్మీయ వేడుకలో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఆయన తనయుడు నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగింది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జున నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈరోజు ఉదయం ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. “ఈ రోజు ఉదయం 9:42 గంటలకు శోభితా ధూళిపాళతో మా కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిందని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది!! ఆమె మా కుటుంబంలోకి వస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము." అని తెలిపారు.

2017లో నటి సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌ ఇద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి చైతూ-శోభిత జంటపై పుకార్లు మొద‌ల‌య్యాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నార‌ని పలు కథనాలు వచ్చాయి. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

Next Story