ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగార్జున.. 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తత
Nagarjuna adopts 1000 acres of forest land on the CM KCR Birthday EVE.తెలంగాణ రాష్ట్రంలో 1000 ఎకరాల రిజర్వ్ పారెస్ట్
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2022 7:51 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో 1000 ఎకరాల రిజర్వ్ పారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో ఓ ఎపిసోడ్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌కు నాగార్జున మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకుని మొక్కలను పెంచుతానని నాగార్జున అన్నారు. కాగా.. ఇచ్చిన మాట ప్రకారం నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అడవిని నాగార్జున దత్తత తీసుకున్నారు.
We all know about the King @iamnagarjuna garu and his commitment towards anything. Be it his fitness, Movies, TVshows and now keeping his promise of adopting 1000 acres of forest land. Now the reserve forest will be named after the Legendary Actor Sri #AkkineniNageshwaraRao garu. pic.twitter.com/vwaaSPSNSU
— Santosh Kumar J (@MPsantoshtrs) February 17, 2022
భార్య అక్కినేని అమల, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నాగార్జున అడవిని దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ లు కూడా భాగస్వాములయ్యారు. వీరంతా కలిసి ఆ ప్రాంతంలో మొక్కలను నాటారు.