'థ్యాంక్యూ సామ్' అంటూ చైత‌న్య ట్వీట్.. పుకార్లకి ఫుల్‌స్టాప్ ప‌డేనా..!

Nagachaitanya replies the Samantha tweet.టాలీవుడ్‌లోని అంద‌మైన జంటల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట ఒక‌టి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sep 2021 7:11 AM GMT
థ్యాంక్యూ సామ్ అంటూ చైత‌న్య ట్వీట్.. పుకార్లకి ఫుల్‌స్టాప్ ప‌డేనా..!

టాలీవుడ్‌లోని అంద‌మైన జంటల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట ఒక‌టి. గ‌త కొద్ది రోజులుగా వీరిద్ద‌రు విడాకులు తీసుకోనున్నార‌నే వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడైతే స‌మంత సోష‌ల్ మీడియాలో అక్కినేని పేరుని తొల‌గించిందో.. అప్ప‌టి నుంచి ఈ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే.. వీటిపై ఇంత‌వ‌ర‌కు ఇటు చైత‌న్య గానీ, అటు స‌మంత గానీ స్పందించ‌లేదు. దీంతో నిజంగానే ఈ జంట విడిపోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

తాజాగా ఈ రూమర్స్‏కు చెక్‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ల‌వ్‌స్టోరీ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లై ఆకట్టుకుంటోంది. దీనిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. చైతన్య ఈ ట్రైలర్ విడుదల చేస్తూ చేసిన ట్వీట్ కు రిప్లై గా నాగ చైతన్య పేరును ట్యాగ్ చేయకుండానే, సాయి పల్లవి పేరును మాత్రం పేర్కొంటూ "విన్నర్" అంటూ చిత్రబృందానికి విషెష్ చెప్పింది స‌మంత‌. దీంతో నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు. కొంద‌రు విడాకుల వార్త‌లు నిజ‌మేన‌ని అంటున్నారు.

అయితే.. స‌మంత ట్వీట్‌పై చైతు స్పందించాడు. థ్యాంక్స్ సామ్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో పుకార్ల‌పై పుల్ క్లారిటీ వ‌చ్చింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా ఏమీ లేద‌ని అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు

Next Story