వెబ్ సిరీస్ లో నాగచైతన్య..!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య కూడా త్వరలో డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నారట. క‌రోనా పుణ్య‌మా అని డిజిట‌ల్ మీడియాకు ఊహించ‌ని డిమాండ్ వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2021 6:54 AM GMT
Nagachaitanya in the web series

క‌రోనా పుణ్య‌మా అని డిజిట‌ల్ మీడియాకు ఊహించ‌ని డిమాండ్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులంతా ఓటీటీల‌కు అతుక్కుపోతున్నారు. దీంతో వారిని ఆక‌ట్టుకునేందుకు పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిలింల నిర్మాణం జరుగుతోంది. ఇక వీటిల్లో న‌టించేందుకు సినిమా స్టార్లు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ తార‌లు ఓటీటీల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాజల్, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల బాట పట్టగా.. ఇప్పుడు హీరోలు సైతం వెబ్ సిరీస్‌ల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య కూడా త్వరలో డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నారట. ఇప్పటికే చైతు భార్య సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో కీలకపాత్ర పోషించింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఆ సిరీస్ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు ఆ సిరీస్ రిలీజ్ కావడానికి ముందే చైతు ఓ వెబ్ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నాడు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో చైతు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.అయితే చైతన్య హిందీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారా లేక తెలుగు వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక నాగార్జున కూడా ఓటి కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే నాగార్జున కంటే ముందే చై డిజిటల్ ఎంట్రీ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.
Next Story
Share it