సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంపై నాగబాబు ఏమన్నారంటే..?
NagaBabu on Sai Dharam Tej health condition.సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడిన
By తోట వంశీ కుమార్ Published on 30 Sept 2021 8:33 AM ISTసెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటాడని ఆస్పత్రిలో తేజ్‌ను పరామర్శించిన వారందరూ చెబుతూ వస్తున్నారు. అయితే.. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజ్ ఆరోగ్యం గురించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని పవన్ చెప్పిన మాటలు అందరిని షాక్‌కు గురి చేశాయి.
ఇక రిపబ్లిక్ ప్రమోషన్స్‌లో భాగంగా రిపబ్లిక్ చిత్ర దర్శకుడు దేవా కట్టా తేజ్ ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలు వచ్చేలా చేశాయి. ప్రమాదం తరువాత తేజ్‌ను కలిసానని.. ఆతరువాతే అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చాడు. తేజ్ వేగంగా కోలుకుంటున్నాడని పైగా రిపబ్లిక్ ఈవెంట్‌ను లైవ్‌లో చూశాడని చెప్పుకొచ్చాడు. దీంతో తేజ్ ఆరోగ్యంపై ఏదీ నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓ నెటిజన్ సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. తేజ్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని, త్వరగా కోలుకుంటున్నాడని, తొందర్లోనే మన ముందుకు వస్తాడు అని చెప్పారు నాగబాబు. ఇక సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే.