'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్‌

Naga Shaurya's Krishna Vrinda Vihari Releasing On April 22nd.యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 7:46 AM GMT
కృష్ణ వ్రింద విహారి రిలీజ్ డేట్ ఫిక్స్‌

యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శౌర్య స‌ర‌స‌న షిర్లే సెటియా న‌టిస్తోంది. ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న‌ ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. బజాజ్ చేతక్ స్కూటర్ పై సంప్రదాయ బద్ధమైన కట్టుబొట్టుతో డార్క్ బ్లూ కలర్ పంచె ధరించి పైన వైట్ షార్ట్ దానికి బ్లాక్ కలర్ స్కార్ఫ్ వేసుకుని బ్రాహ్మణ యువకుడిగా నాగశౌర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

సీనియ‌ర్ న‌టి రాధిక ముఖ్య భూమిక పోషిస్తుండ‌గా.. వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, స‌త్య‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కృష్ణ, వ్రింద, విహారి అనే మూడు పాత్రల మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తోంది. కాగా.. ఇటీవ‌ల కాలంలో నాగశౌర్యకి స‌రైన హిట్ పడలేదు. 'వరుడు కావలెను', 'లక్ష్య' ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో ఈ చిత్రంతో ఖ‌చ్చితంగా హిట్ కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు శౌర్య‌.

Next Story
Share it