ఓ ఇంటివాడైన యంగ్ హీరో నాగ‌శౌర్య‌

Naga Shaurya ties the knot with Anusha Shetty.టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఓ ఇంటివాడు అయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2022 12:53 PM IST
ఓ ఇంటివాడైన యంగ్ హీరో నాగ‌శౌర్య‌

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఓ ఇంటివాడు అయ్యాడు. బెంగ‌ళూరుకు చెందిన ప్ర‌ముఖ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అనూష మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం 11.25 గంట‌ల‌కు బెంగ‌ళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో బంధుమిత్రులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వైభ‌వంగా నాగ‌శౌర్య వివాహం జ‌రిగింది. టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు నాగ‌శౌర్య వివాహానికి హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. శౌర్య పెళ్లిఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

జ‌యాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు హీరో నాగ‌శౌర్య. 'దిక్కులు చూడకు రామయ్య' 'ఓ బేబీ' 'ఛలో' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా 'కృష్ణ వ్రింద విహారి' చిత్రంతో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చాడు. అయితే.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది.

Next Story