బంగార్రాజు.. నాగలక్ష్మిగా ఆకట్టుకుంటున్న కృతి శెట్టి
Naga Lakshmi look in Bangarraju Movie release.అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న
By తోట వంశీ కుమార్
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. పుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతు కు జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కనిపించనుంది.
Our #nagalakshmi is here to be a part of your home and you are sure to fall in love with her more … @iamnagarjuna @chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @anuprubens @ZeeStudios_ @lemonsprasad @zeemusiccompany
— Annapurna Studios (@AnnapurnaStdios) November 18, 2021
@raoramesh @vennelakish @anithachowdhary @anchorjhansi pic.twitter.com/IVY7puQGDJ
అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుంగా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం బావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన 'లడ్డుండా' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కృతిశెట్టి.. నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుతో మెడలో దండలతో మెరిసిపోతూ రివీలైన ఆమె మేకోవర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.