నాగ చెత‌న్య టూ మంచు మ‌నోజ్ : హైదరాబాద్ పోలీసులు 10 మంది టాలీవుడ్ ప్రముఖులకు జరిమానా విధించారు

Naga Chaitanya to Manchu Manoj Hyderabad police fines 10 Tollywood celebrities.తమ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించినందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2022 6:11 AM GMT
నాగ చెత‌న్య టూ మంచు మ‌నోజ్ : హైదరాబాద్ పోలీసులు 10 మంది టాలీవుడ్ ప్రముఖులకు జరిమానా విధించారు

తమ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించినందుకు కనీసం పది మంది టాలీవుడ్ నటులు మరియు దర్శకులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

సోమవారం సినీనటుడు నాగ చైతన్య త‌న కారుకు బ్లాక్ ఫిలిం అద్దాలు ఉప‌యోగించినందుకు రూ.700 జరిమానా విధించారు. గత నెల రోజుల్లో.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారు అద్దాల‌కు నలుపు రంగును ఉపయోగించినందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

మార్చి 20న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్రమ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 38,522 నంబర్‌ ప్లేట్లు సరికాని, సక్రమంగా లేని వాటిని గుర్తించారు. ఇప్పటి వరకు 9583 కేసులు బుక్ అయ్యాయి. మరోవైపు టింటెడ్ గ్లాస్‌పై 10,565 కేసులు నమోదయ్యాయి.జెడ్‌, జెడ్ ఫ్ల‌స్ కేట‌గిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

వాహ‌నాల చ‌ట్టంలోని సెక్షన్ 50, 51, 52 అనుస‌రించి 'పోలీస్', 'ప్రభుత్వ వాహనం', 'కార్పొరేటర్', 'ప్రెస్', 'ఆర్మీ', 'ఎమ్మెల్యే', 'ఎంపీ' అని స్టిక్క‌ర్లు అంటించుకున్నవాహ‌నాల‌ను సైతం పోలీసులు ఆపుతున్నారు. స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా స్టిక్క‌ర్లు అంటించుకున్న వాహ‌నాల‌ను గుర్తించి వాటిని తొల‌గించారు.

విండ్‌స్క్రీన్ మరియు విండో గ్లాసెస్‌పై ఎలాంటి VLT (విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్) ఫిల్మ్‌ను అనుమతించబోమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా స్పష్టం చేశారు. కార్ మెకానిక్‌లు, యాక్సెస‌రీ షాపుల‌ య‌జ‌మానుల‌ను పిలిచి చ‌ట్ట‌విరుద్దంగా ఎవ‌రైనా బ్లాక్ ఫిల్మ్‌ల‌ను బిగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఆర్టీసీ బ‌స్సులు, ప్రైవేట్ మరియు టూరిస్ట్ బస్సులు, స్కూల్ బస్సులపై బ్లాక్ ఫిల్మ్‌ల‌ను గుర్తించామ‌ని.. వెంట‌నే వాటిని తొల‌గించాల‌ని సూచించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యంగా నంబర్ ప్లేట్లకు సంబంధించి మోటారు వాహనాల చట్టం కింద పేర్కొన్న మార్గదర్శకాలను చాలా వాహనాలు పాటించడం లేదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం గుర్తించింది. "కొన్ని సందర్భాల్లో, నిర్దేశించిన నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్ పరిమాణం లేదు. చాలా మంది వాహన యజమానులు ట్రాఫిక్ పోలీసులకు గుర్తించకుండా మరియు చలాన్‌ల నుండి తప్పించుకోవడానికి నంబర్లు మరియు అక్షరాలను తారుమారు చేశారు" అని పోలీసులు తెలిపారు.

Next Story