మహేశ్ బాబుకి వీరాభిమానిగా అక్కినేని హీరో నాగ చైతన్య

Naga Chaitanya as Mahesh babu fans President.మహేశ్ బాబుకి వీరాభిమానిగా అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త సినిమా .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2021 2:30 PM IST
Hero Naga Chaitanya

స్టార్ హీరోల‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. వారి సినిమాలు విడుద‌ల అవుతున్నాయి అంటే చాలు.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేస్తారు. ఇక మ‌హేష్ సినిమా రిలీజ్ అవుతోందంటే.. హంగామా మామూలుగా ఉంటుందా..? థియేట‌ర్ల ముందు ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు క‌ట్టి క‌టౌట్లు నిల‌బెట్టి నానా హంగామా చేస్తారు. థియేటర్ల దగ్గర వాళ్ల సందడి చూసి తీరాల్సిందే.

ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య కూడా అలాగే మహేశ్ బాబుకి అభిమానిగా మారాడు. అంతేకాదండోయ్ మ‌హేష్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ కే అధ్య‌క్షుడిగా సెటిలైపోయాడు. అయితే.. ఇది నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ' చిత్రంలోనిది ఈ ముచ్చ‌ట‌. 'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ' పేరిట ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలోనే చైతు అలా మహేశ్ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ అబిడ్స్ లోని రామకృష్ణ సినిమా హాల్ లో సాగుతోంది. కథానాయకుడు నాగ చైతన్యపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ వీరాభిమాని అభిరామ్ గా నాగచైతన్య కనిపించనున్నారు. అభిరామ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా కనిపిస్తారట. మహేష్ తో ఫ్యాన్ అధ్యక్షుడు అభిరామ్ బ్యానర్లు రిలీజ్ వేళ థియేటర్ల ముందు చేసే సంద‌డిని ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


Next Story