మాస్ సెప్ట్స్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్‌ అబ్బ‌వ‌రం

Nachav Abbai song out from Nenu Meeku Baga Kavalsina Vadini movie.కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2022 7:23 AM GMT
మాస్ సెప్ట్స్‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్‌ అబ్బ‌వ‌రం

కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవ‌ల 'స‌మ్మ‌త‌మే' చిత్రంతో స‌క్సెస్ అందుకున్న కిర‌ణ్ చేతిలో ప్ర‌స్తుతం నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో 'నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని' ఒక‌టి. 'ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం' ఫేమ్‌ శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కోడి దివ్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజనా ఆనంద్, సిద్ధార్థ్‌ మీనా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట విడుద‌లైంది. 'న‌చ్చావ్ అబ్బాయి' అంటూ పాట సాగుతోంది. ధనుంజయ్, లిప్సిక పాడ‌గా మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. భాస్కరపట్ల లిరిక్స్ రాశారు. ఈ పాట‌లో కిర‌ణ్ త‌న స్టెప్పుల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Next Story