ఆర్ఆర్ఆర్.. నాటు నాటు వీర నాటు అదుర్స్
Naatu Naatu song promo RRR movie out.సినీ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో '
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 11:48 AM ISTసినీ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం )' సినిమా ఒకటి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, దోస్తీ సాంగ్ విడుదల చేసింది.
తాజాగా రెండో పాట ప్రొమోను విడుదల చేసింది. 'నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు' అంటూ ఈ పాట సాగుతోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్‌లు సెప్టులతో ఆదరగొట్టారు. ఇక పూర్తి పాట రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం 19 సెకన్లు గల ఈ వీడియో యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా.. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.