తార‌క్‌, చ‌ర‌ణ్‌ నాటు డ్యాన్స్ అద్ధిరిపోయిందంతే

Naatu Naatu song from RRR Movie Out.సినీ అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 3:46 PM IST
తార‌క్‌, చ‌ర‌ణ్‌ నాటు డ్యాన్స్ అద్ధిరిపోయిందంతే

సినీ అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం )' సినిమా ఒక‌టి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, దోస్తీ సాంగ్ విడుద‌ల చేసింది.

తాజాగా రెండో పాట 'నాటు నాటు' లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది. 'నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు' అంటూ ఈ పాట సాగుతోంది. ఇందులో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు సెప్టుల‌తో ఆద‌ర‌గొట్టారు.చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందించ‌గా.. రాహుల్ సిప్లిగంజ్‌, కాల‌భైర‌వ పాట‌ను పాడారు. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది. అలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియా శ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story