ఆస్కార్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో 'నాటు నాటు'

Naatu Naatu Nominated For Best Original Song. దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది

By Medi Samrat  Published on  24 Jan 2023 8:06 PM IST
ఆస్కార్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు

దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది. ఇప్ప‌టికే ప్ర‌తిష్టాత్మ‌క‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న నాటు నాటు పాట‌.. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో టాప్‌ -4లో నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో ద‌ర్శ‌కుడు రాజమౌళి అంతర్జాతీయంగా గుర్తింపుపొందాడు. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌ ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది.

ఆర్ఆర్ఆర్.. అంత‌ర్జాతీయంగా అవార్డులు కొల్ల‌గొడుతున్న వేళ‌ దర్శక ధీరుడు రాజమౌళిని, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కలిశారు. ఈ భేటీలో ఆర్ఆర్ఆర్ గురించి ఇద్దరూ ముచ్చటించారు. తాను ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూశానని రాజ‌మౌళికి కామెరూన్ తెలిపారు. నీరు, నిప్పు, కథతో అద్భుతంగా తీశారంటూ రాజ‌మౌళిని కొనియాడారు. మ్యూజిక్ మరింత అద్భుతంగా ఉందని, ప్రతీ సీన్ ను రక్తికట్టించిందన్నారు. కొన్ని సన్నివేశాలకు లేచి నిల్చున్నానని అన్నారు. మీరే కదా సంగీతం అందించింది అంటూ పక్కనే ఉన్న ఎంఎం కీరవాణిని సైతం అభినందించారు. కామెరూన్ ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశారని ఆయన భార్య చెప్పారు. తను ఓసారి చూసి బాగుందని చెప్పి.. మళ్లీ తనతో కలిసి మరోసారి చూశాన‌ని, రెండోసారి కూడా రెప్పవాల్చకుండా చూశాన‌ని అన్నారు. భవిష్యత్తులో మీరు హాలీవుడ్ లో సినిమా తీసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని రాజమౌళికి కామెరూన్ చెప్పారు.

Next Story