నారప్ప : 'చలాకీ చిన్నమ్మి' సాంగ్ వ‌చ్చేసింది

Naarappa first single Chalaaki Chinnammi released.విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం నార‌ప్ప‌. శ్రీకాంత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 5:51 AM GMT
నారప్ప : చలాకీ చిన్నమ్మి సాంగ్ వ‌చ్చేసింది

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'నార‌ప్ప‌'. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి క‌థానాయిక‌. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. నేడు మ‌ణిశ‌ర్మ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలోని 'చ‌లాకీ చిన్న‌మ్మి' అనే పాట‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

వెంకీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను యంగ్ ప్లేబ్యాక్ సింగర్స్ నూతన మోహన్, ఆదిత్య అయ్యంగార్ అద్భుతంగా ఆలపించారు. ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం బాగుంది. ఈ సాంగ్ తో మణిశర్మ మరోసారి అందరి మనసులను దోచేశారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం "అసురన్" రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర విడుద‌ల ఆల‌స్యం అవుతోంది. ఈ చిత్రం ఓటిటిలో విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా 'చలాకీ చిన్నమ్మి 'వినేయండి.

Next Story