నాంది ట్రైలర్‌.. అంచ‌నాల‌ను పెంచేశాడు

Naandhi Trailer out.ఒక‌ప్పుడు మినిమం గ్యారెంటీ అనిపించుకున్న అల్ల‌రి న‌రేష్.. గ‌త కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2021 11:34 AM IST
నాంది ట్రైలర్‌.. అంచ‌నాల‌ను పెంచేశాడు

ఒక‌ప్పుడు మినిమం గ్యారెంటీ అనిపించుకున్న అల్ల‌రి న‌రేష్.. గ‌త కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడు. తాజాగా అల్ల‌రోడు న‌టిస్తున్న చిత్రం 'నాంది'. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుత‌న్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నుంది. స‌తీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు.

'రాజ‌గోపాల్ గారిని నేను మ‌ర్డ‌ర్ చేయ‌డం ఏమిటి స‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌గోపాల్ గురించి విన‌డం త‌ప్పా ఆయ‌న గురించి నాకేం తెలీదు' అంటూ న‌రేశ్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. 'అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొదలైంది' అంటూ న‌రేష్ చెప్పే డైలాగ్ ఈల‌లు వేయిస్తోంది. చేయ‌ని త‌ప్పుకు జైలు శిక్ష అనుభ‌వించే వ్య‌క్తి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టించారు. పూర్తి ప‌ర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా నాంది చిత్రం ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందించారు.


Next Story