మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం.. 'నాగిని-3' నటుడి అరెస్టు

Naagin 3 fame Pearl v puri arrested.అత్యాచారం కేసులో ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు, నాగిని 3 సీరియ‌ల్ ఫేం పర్ల్ వీ పూరిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2021 6:19 AM GMT
మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం.. నాగిని-3 నటుడి అరెస్టు

అత్యాచారం కేసులో ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు, 'నాగిని 3' సీరియ‌ల్ ఫేం పర్ల్ వీ పూరిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అత‌డితో పాటు మ‌రో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తనను కిడ్నాప్‌ చేసి కారులో తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని, అంతేగాక తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్వానీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

16 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడిన పర్ల్ వీ పూరితో పాటు అతడి ఐదుగురు స్నేహితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పర్ల్ వీ పూరి కెరీర్ విషయానికి వస్తే ఆయన 2019లో 'దిల్ కీ నజర్ సే ఖూబ్ సూరత్' అనే సీరియల్‌తో హిందీ వినోదరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఫిర్ బీ నా మానే', 'బత్తమీజ్ దిల్' సీరియల్‌తో పాపులారిటీని సంపాదించారు. 'నాగిన్ 3', 'నాగార్జున ఏక్ యోధ', 'బేపనా ప్యార్' సీరియల్స్‌తో మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం' బ్రహ్మరాక్షస్ 2' టీవీ సీరియల్‌లో నటిస్తున్నారు.

Next Story
Share it