ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన 'నా సామిరంగ' టీమ్
అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా నా సామిరంగ.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2023 2:45 PM ISTఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన 'నా సామిరంగ' టీమ్
అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా నా సామిరంగ. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ ప్రైజ్ ను ఇచ్చింది మూవీ యూనిట్. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఉన్నాడట!! 'అంజి' అనే కీలక పాత్రలో కనిపించనున్నాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆయన పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మా అంజి గాడ్ని మీకు పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటోచ్చేత్తది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంజి గాడి పాత్రకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను డిసెంబర్ 15 ఉదయం 10.18 గంటలకు విడుదల చేయనున్నారు.
'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే' అనే లిరికల్ సాంగ్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్ అందించారు. ఈ పాటలో హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఎంతో క్యూట్ గా కనిపించింది. ఈ చిత్రంలో ఆమె వరలక్ష‍్మి పాత్రలో కనిపించనుంది.
అంజి గాడు వస్తున్నాడు!! నా సామి రంగ 🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 14, 2023
Introducing @allarinaresh as Anji with a special intro glimpse tomorrow at 10:18 AM💥#NaaSaamiRanga #NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @AshikaRanganath @vijaybinni4u @mmkeeravaani @srinivasaaoffl @SS_Screens @boselyricist @Dsivendra… pic.twitter.com/vdwETgATRB