'స‌ర్కారు వారి పాట' సాంగ్ లీక్‌.. థ‌మ‌న్ ఆవేద‌న‌.. 'వాడికి పనిస్తే ఇలా చేశాడు' అంటూ

Music Director Thaman Emotional comments on Sarkaru Vaari Paata Movie Song Leak.సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2022 2:39 AM GMT
స‌ర్కారు వారి పాట సాంగ్ లీక్‌.. థ‌మ‌న్ ఆవేద‌న‌.. వాడికి పనిస్తే ఇలా చేశాడు అంటూ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్‌ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో మ‌హేశ్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. కాగా.. ఈచిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు మూవీపై హైప్‌ను మ‌రింత పెంచుతున్నాయి. ఇక ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి తొలి రిలిక‌ల్ పాట‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 'క‌ళావ‌తి' అంటూ ఆ పాట సాగ‌నుంది.

ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే.. చిత్ర‌బృందం విడుద‌ల చేయ‌క‌ముందే ఆ పాట లీకైంది. దీనిపై మ‌హేష్ అభిమానులు మండిప‌డుతున్నారు. దీనిపై సంగీత థ‌మ‌న్ స్పందించాడు. ఓ వాయిస్ మెసేజ్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ రికార్డింగ్ కి పని చేసిన వాళ్ళు, డైరెక్టర్, నిర్మాత దీనికోసం పెట్టిన డబ్బులు.. ఇలా చాలా.. మా అందరి కష్టం ఈ సాంగ్. ఈ పాట రికార్డింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మేము మా హీరోగారికి చూపించాల్సిన ప్రేమ, మా అబిమానం అంతా ఈ పాటలో చూపించాము. అద్బుతమైన లిరిక్స్‌ వచ్చాయి. మా డైరెక్టర్‌ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ లిరికల్‌ వీడియోని తయారు చేశారు. మేం ఎంతో హ్యాపీగా ఈ పాట కోసం వరల్డ్‌లోనే బెస్ట్‌ ప్లేస్‌, మాస్టరింగ్‌, మిక్సింగ్‌ టెక్నాలజీ వాడాం. అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్‌లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా ఉండాలా, బాద పడాలా.. మూవ్‌ఆన్‌ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్‌ బ్రేకింగా ఉంది. నేను అస్సలు ఇంత హార్ట్‌ బ్రేక్‌ అవ్వను, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్నో ఎదురుకున్నాను లైఫ్ లో. నేను ఇలా పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ ఎందుకు పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి, ఈ వీడియో లీక్ చేసినోడికి పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి' అంటూ థ‌మ‌న్ వాయిస్ మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

ఇక పాట లీక్ కావ‌డంతో రేపు(ఫిబ్ర‌వ‌రి 14) వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సిన ఈ పాట‌ను నేడు అధికారికంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలియ‌జేసింది.

Next Story
Share it