వారిసు సినిమా చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న థ‌మ‌న్‌

Music Director Thaman Emotional after see the Varisu movie.ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం వారిసు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2023 11:18 AM IST
వారిసు సినిమా చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న థ‌మ‌న్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న రష్మిక మందన్న న‌టించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో 'వార‌సుడు' పేరుతో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

సంక్రాంతి కానుక‌గా ఈ రోజు(జ‌న‌వ‌రి 11) తెలుగు రాష్ట్రాలు మిన‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విజ‌య్ అభిమానులు ఈ సినిమాని చూసి పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీమియ‌ర్ షో చూసి థ‌మ‌న్ బావోద్వేగానికి లోనైయ్యాడు. సినిమాలోని ఎమోష‌న‌ల్ సీన్స్ చూసి ఏడ్చేశాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా థ‌మ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

"విజ‌య్ అన్నా.. ఈ చిత్రంలోని ఎమోష‌న‌ల్ సీన్స్ చూసి ఏడ్చేశా. క‌న్నీళ్లు చాలా విలువైన‌వి. వారిసు సినిమా నా హృద‌యాన్ని తాకింది. ఇంత పెద్ద అవ‌కాశం నాకు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ల‌వ్ యూ అన్నా." అని థ‌మ‌న్ ట్వీట్ చేశాడు.

థ‌మ‌న్ థియేట‌ర్‌లో ఏడ్చిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తెలుగులో ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



Next Story