టాలీవుడ్‌ను వదలని కరోనా.. తమన్‌కు పాజిటివ్
Music Director SS Thaman tests Covid 19 positive.కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. సామాన్యులు,
By తోట వంశీ కుమార్ Published on
7 Jan 2022 9:12 AM GMT

కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని సెలబ్రెటీలు ఈ వైరస్ కోరలకు చిక్కుతున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విశ్వక్‌సేన్, మహేష్‌బాబులకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
ఈ విషయాన్ని ఆయన అఫీషియల్ గా ఇంకా ప్రకటించనప్పటికీ.. ఇండస్ట్రీకి చెందిన వారు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు.
కాగా గతేడాది.. తమన్ నుంచి సెన్సేషనల్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ ఏడాది కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. 'భీమ్లానాయక్, సర్కారువారి పాట, గాడ్ ఫాదర్' లాంటి చిత్రాలకు తమన్ అదిరిపోయే మాస్ బీట్స్ ను రెడీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కరోనా బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు.
Next Story