అనుకున్నట్లే జరిగింది.. ఆలియాకు కష్టాలు మొదలయ్యాయి

Mumbai court issues summons to Alia Bhatt.సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సినిమా 'గంగూభాయ్ కతియవాడి' విడుదలకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2021 3:01 PM GMT
అనుకున్నట్లే జరిగింది.. ఆలియాకు కష్టాలు మొదలయ్యాయి

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సినిమా 'గంగూభాయ్ కతియవాడి' విడుదలకు సిద్ధమవుతోంది. ఆలియాభట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉండంటూ పలువురు మెచ్చుకుంటూ ఉన్నప్పుడే వివాదాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్ర‌లో నటిస్తుంది. ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వ‌ర్క‌ర్‌ అయిన గంగూభాయ్ క‌తియావాడి జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమా కోసం ముంబయ్‌ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్‌ వేశారు. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

కామాతిపురాను అవమానించేలా ఈ సినిమా ఉందంటూ పలువురు మండి పడ్డారు. ఆ ప్రాంతాన్ని జనాల్లో తక్కువ చేసి చూపిస్తున్నారని, హేళన చేస్తున్నారని.. ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు ఇప్పుడు సైంటిస్టులు అయ్యారని, దేశం గర్వపడే స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. గంగూబాయ్ సినిమాలో మాత్రం ఇప్పటికీ అది సెక్స్ వర్కర్స్ అడ్డా అన్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగూబాయ్‌ కతియావాడి సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్‌లో తెలపగా.. దీనిపై విచారించిన కోర్టు ఆలియా భట్‌, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్‌ జైదీలకు సమన్లు జారీ చేసింది. మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది.
Next Story