ముక్కు అవినాశ్ తల్లికి తీవ్ర అనారోగ్యం.. ఆదుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం

Mukku Avinash recieved CMRF check.అవినాశ్ త‌ల్లి ల‌క్ష్మీరాజం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్య ఖర్చులు అధికంగా ఉండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2021 5:06 PM IST
Mukku Avinash recieved CMRF check

జబర్దస్త్ క‌మెడియ‌న్‌, బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ అంటే తెలియ‌ని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండ‌క‌పోవ‌చ్చు. ఇదిలా ఉంటే.. అవినాశ్ త‌ల్లి ల‌క్ష్మీరాజం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె చికిత్స‌కు పెద్ద మొత్తంలో ఖ‌ర్చుఅవుతుండ‌డంతో అవినాశ్ కుటుంబ స‌భ్యులు ప్ర‌భుత్వ సాయం కోరారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఆమె వైద్యానికి అయ్యే న‌గ‌దును చెక్కు రూపంలో అందించింది. ముక్కు అవినాశ్ స్వస్థలం జగిత్యాల జిల్లా రాఘవపట్నం (గొల్లపల్లి మండలం).


ఇటీవలే అవినాశ్ తల్లి కాళ్ల లక్ష్మీరాజం అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే.. వైద్య ఖర్చులు అధికంగా ఉండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. అవినాశ్ కుటుంబ సభ్యుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేలు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన చెక్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ నటుడు ముక్కు అవినాశ్ కు అందజేశారు. ఈ సందర్భంగా అవినాశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. అవినాష్‌ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్‌గా వచ్చినా అత‌డు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్‌ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేశారు. ప్ర‌స్తుతం ఓ కామెడి షోలో అల‌రిస్తున్నాడు


Next Story