ఎట్టకేలకు కమెడియన్ ముక్కు అవినాష్ ఓ ఇంటివాడు అయ్యాడు. ఎన్నాళ్ల నుంచో పెళ్లి పెళ్లి అని కలవరిస్తున్న అవినాష్ కల నెరవేరింది. తన చిన్ననాటి స్నేహితురాలు అనూజ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లి వేడుకకు జబర్థస్త్ టీమ్‌తో పాటు, కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. అనూజ మెడలో అవినాష్ తాళి కడుతున్న వీడియోను రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అవినాష్ తన పెళ్లి వీడియోని తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే.. అంతలోనే రాంప్రసాద్ వీడియోను షేర్ చేసిన అవినాష్‌కు షాకిచ్చాడు. 'సారీ అవినాష్ ఇదో పెద్ద బ్లండర్ మిస్టేక్.. నీకు ఏం హెల్ప్ చేయలేకపోతున్నాం.. ఇట్స్ ఫన్ ' అంటూ తనదైన పంచ్ డైలాగ్ వేశాడు. ప్రస్తుతం అవినాష్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు అందరూ అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ పెళ్లి వీడియోలో శ్రీముఖి అరుస్తూనే ఉంది. పెళ్లి బాజాల మోతలో కూడా లౌడ్ స్పీకర్ రాములమ్మ గొంతు వినిపిస్తూనే ఉంది. అనూజకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. అప్పట్లో టిన్‌టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది.