రూమర్లకు చెక్.. ఘనంగా ముక్కు అవినాష్ ఎంగేజ్‌మెంట్
Mukku Avinash Engagement completed.జబర్దస్ కామెడి షోతో పాపులర్ అయిన కమెడియన్ ముక్కు అవినాష్
By తోట వంశీ కుమార్ Published on 1 Sept 2021 10:14 AM IST'జబర్దస్' కామెడి షోతో పాపులర్ అయిన కమెడియన్ ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అవినాష్ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అనూజతో త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు.
సరైన వ్యక్తి మన జీవితంలోకి వస్తుంటే.. వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇరు కుటుంబాలు, మేము కలిసాం. అనుజతో నాకు నిశ్చితార్థం అయ్యింది. మీరందరూ పెళ్లి ఎప్పుడు అని నన్ను చాలా సార్లు అడిగారు. అతి త్వరలోనే నా అనూజను పెళ్లిచేసుకోబోతున్నాను. ఎప్పటిలాగానే మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను మీ ముక్కు అవినాష్ అని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేశాడు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు. దీంతో అవినాష్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
ప్రముఖ రియాల్టీ షో 'బిగ్ బాస్' హౌస్ లోనూ సందడి చేశాడు అవినాష్. వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చి.. తనదైన పంచులు, కామెడీతో అందరిని అలరించాడు. మరో కంటెస్టెంట్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. త్వరలోనే వీరిద్దరు పుకార్లు షికారు చేశాయి. అయితే వీరిద్దరూ.. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికి సమ్‌థింగ్ సమ్‌థింగ్ వార్తలు ఆగలేదు. ఇక అవినాష్ ఎంగేజ్‌మెంట్‌తో ఆ వార్తలు అన్నింటిని చెక్ పెట్టాడు.