'ముఖచిత్రం' ట్రైలర్ చూశారా..?

Mukha chitram trailer released.వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా తెర‌కెక్కుతున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 12:47 PM IST
ముఖచిత్రం ట్రైలర్ చూశారా..?

వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా తెర‌కెక్కుతున్న చిత్రం 'ముఖ చిత్రం'. విశ్వ‌క్‌సేన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి క‌ల‌ర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ క‌థ అందివ్వ‌గా గంగాధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. క‌థానాయ‌కుడు ఓ ప్లాస్టిక్ స‌ర్జ‌న్‌. ఒకమ్మాయి ముఖాన్ని ఇంకో అమ్మాయికి మార్చడం, హీరో పాత్రకి వారి ఇద్దరికీ ఉన్న కనెక్షన్ ఏంటి దాని వల్ల ఏమవుతుంది అనే అంశాలు ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. ఇక విశ్వ‌క్ లాయ‌ర్ గా క‌నిపించాడు. వాళ్లు కోర్టుకు ఎందుకు వ‌చ్చారు. కోర్టులో ఏం జ‌రిగింద‌నేది అనే థ్రిల్ల‌ర్ లా ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. కళా భైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింద‌నే చెప్పాలి. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story