టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను బాగానే నవ్విస్తున్నాడు. ఇటీవల అతను హీరోగానూ రాణిస్తున్నాడు. 'గీతాంజలి', 'జయమ్ము నిశ్చయమ్మురా', 'జంబలకిడిపంబ' వంటి సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని చిత్రాలు విజయం సాధించడంతో కొత్త ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా 'ముగ్గురు మొనగాళ్లు' పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.
ముగ్గురు మిత్రుల జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. నశ్రీనివాస్ రెడ్డి చెవిటివాడి పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా కనిపించనున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ కథానాయికలుగా నటించారు. రాజా రవీంద్రను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ కామెడీతో పాటు సస్పెన్స్తో నిండి ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రైలర్ పై లుక్కేయండి.