మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ న్యూ లుక్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Most Eligible Bachelor Sankranthi Poster.అక్కినేని యువ హీరో అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.సోష‌ల్ మీడియాలో వైర‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 1:35 PM GMT
Most Eligible Bachelor  poster

అక్కినేని యువ హీరో అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌సన పూజా హెగ్డే న‌టిస్తోంది. బ‌న్నివాసు, ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా ప‌డింది. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఇప్పటి వరకు మూవీ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలాగే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌థ్యంలో సిధ్ శ్రీరామ్ ఆలపించిన 'మనసా మ‌న‌సా' పాటకు, ఆ త‌రువాత విడుదల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.


తాజాగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అఖిల్ ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఈ పోస్టర్ లో పూజాహెగ్డే అఖిల్ భుజాల పై చేతులు వేసి చూస్తూ ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అఖిల్ లేత గడ్డంతో స్మైల్ ఇస్తూ కెమెరా వైపు లుక్కేసాడు. ఈ చిత్రంపై అఖిల్ భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. మ‌రీ ఈ యంగ్ హీరో ఆశించిన హిట్‌ను బొమ్మరిల్లు భాస్క‌ర్ అందిస్తాడో లేదో చూడాలి మ‌రీ.


Next Story