అఖిల్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రిలీజ్ డేట్ ఫిక్స్
Most Eligible Bachelor movie release on October 8th.అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.
By తోట వంశీ కుమార్ Published on
28 Aug 2021 6:43 AM GMT

అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. యూత్ పుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాకాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో అఖిల్, విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ఆమని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటు అఖిల్‌కి అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ చిత్ర విజయం చాలా కీలకం.
Next Story