మోసగాళ్లు ట్రైలర్ విడుద‌ల‌.. మంచు విష్ణు హిట్ కొట్టేలాగా ఉన్నాడుగా

Mosagallu thetrical trailer out.మంచు విష్ణు, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం మోస‌గాళ్లు. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 5:00 PM IST
మోసగాళ్లు ట్రైలర్ విడుద‌ల‌.. మంచు విష్ణు హిట్ కొట్టేలాగా ఉన్నాడుగా

మంచు విష్ణు, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'మోస‌గాళ్లు'. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌పంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్.. మంచు విష్ణు సోద‌రి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో న‌టిస్తుండ‌గా.. నవదీప్ కీలక పాత్రలో క‌నిపించ‌నున్నాడు.


ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్టులుక్‌, ప్రొమోస్ ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. 'డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా' డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకొని వెళుతోంది. తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, తెలుగు భాషల్లో విడుద‌ల‌కానుంది.


Next Story