మోసగాళ్లు లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ క్యారక్టర్.. టీజ‌ర్ అదిరింది

Mosagallu Teaser Release. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''మోసగాళ్లు".

By Medi Samrat  Published on  13 Nov 2020 9:23 AM GMT
మోసగాళ్లు లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ క్యారక్టర్.. టీజ‌ర్ అదిరింది

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''మోసగాళ్లు". కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇందులో విష్ణు చెల్ల‌లి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జెప్రీ జీ చిన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. . బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన 'మోసగాళ్లు' చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా సునీల్ శెట్టి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు.

సునీల్ శెట్టి ఏసీపీ కుమార్ పాత్రలో నటిస్తున్నాడు. అతి పెద్ద ఐటీ స్కామ్ నిందితులను పట్టుకునే పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. ఈ టీజర్ లో 'నా జోన్ లో ఎవడైనా తప్పు చేస్తే వాడి లైఫ్ ఇంక డేంజర్ జోనే..వాడు ఎంత తోపైనా నేను వదిలిపెట్టను' అంటూ సునీల్ శెట్టి పవర్ ఫుల్ డైలాగ్ చెప్తున్నాడు. టీజర్ చివరలో మంచు విష్ణు ఏసీపీ కుమార్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు నవ్వుతున్నాడు. దీనికి సామ్ సీఎస్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. 4 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.


Next Story
Share it