'దృశ్యం' సినిమా ఫ్రాంచైజీ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. చిత్రనిర్మాతలు ఈ సిరీస్ లో భాగంగా మూడో పార్ట్ రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. నటీనటుల వివరాలు, విడుదల తేదీ గురించి వెల్లడించలేదు. మోహన్‌లాల్ ఈ వార్తను సోషల్ మీడియాలో అధికారికంగా ధృవీకరించారు. “The past never stays silent… Drishyam 3 confirmed!” అంటూ పోస్ట్‌ను పంచుకున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా మోహన్ లాల్ పోస్ట్ చేశారు.
జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం ఫ్రాంచైజీ, భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రసిద్ధ థ్రిల్లర్ సిరీస్‌లలో ఒకటి. పలు భాషల్లో రీమేక్ అయి సంచలన విజయం అందుకుంది.